AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచే: బడ్జెట్ తోపాటు కీలక బిల్లులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఏడాదికిగానూ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందే ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.

ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2024-25 ఆర్థిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్టు సహా పలు కీలకమైన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

కాగా, ఈ ఏడాది మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్​‌కు ముందు నాలుగు నెల‌ల‌కు గాను ఓటాన్ ఏకౌంట్​‌ను గత ప్రభుత్వం ప్రవేశ‌పెట్టింది అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన కూటమి ప్రభుత్వం త‌ర్వాత మ‌రో నాలుగు నెల‌ల‌కు గాను ఓటాన్ ఎకౌంట్ బ‌డ్జెట్​‌కు అమోదం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో వ‌చ్చే నాలుగు నెల‌ల‌కు గాను పూర్తి స్థాయిలో 2024- 25 ఏడాదికి బ‌డ్జెట్‍​ను ప్రవేశ పెట్టనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల తర్వాత శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. అదే విధంగా శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌​ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్​‌ని మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ వాయిదా తర్వాత సభాపతి అధ్యక్షతన బీఎసీ సమావేశం జరగనుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10