AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

| హైద‌రాబాద్​లో భారీ పేలుడు.. తెలంగాణ స్పైసీలో ఘ‌ట‌న‌

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 1లోని తెలంగాణ స్పైస్ కిచెన్ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. హోటల్‌లోని రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పెద్ద శబ్దంతో పేలింది. దీంతో హోటల్ ప్రహరీ ధ్వంసమైంది. గోడ రాళ్లు ఎగిరి వంద మీటర్ల దూరంలోని దుర్గాభవానీ నగర్ బస్తీలో పడడంతో నాలుగు గుడిసెలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాళ్లు తగిలి ఇంట్లోని ఓ చిన్నారికి తీవ్ర గాయాల‌య్యాయి. ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పాప ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స్థానికులు తెలిపారు. రాళ్ల తాకిడితో ఓ మహిళ కూడా గాయపడింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హోటల్ నిర్వాహకులతో మాట్లాడారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, హోటల్‌ నిర్వాహకులు మీడియాను లోపలికి అనుమతించలేదు. దీంతో ప‌లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌నా స్థ‌లంలో క్లూస్ టీమ్‌తో ప‌రిశీలిస్తున్నారు.

ANN TOP 10