మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే అని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ నేతలతో సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని అన్నారు.
ప్రభుత్వం అంటే అందర్నీ కాపాడాలని అన్నారు. సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలని.. అంతేతప్ప కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దని సూచించారు. అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి అని తెలిపారు. మాకు మాటలు రావనుకుంటున్నారా.. ఇవాళ మొదలపెడితే రేపటి వరకు మాట్లాడతానని తెలిపారు. రౌడీ పంచాయితీలు చేయడం తమకు కూడా తెలుసని చెప్పారు. ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మీకు బాధ్యతను అప్పగించారు.. బాధ్యతాయుతంగా సేవ చేయాలని సూచించారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ నాయకులు భయపడవద్దని.. మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనదే విజయమని ధీమా వ్యక్తం చే శారు. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయిందని తెలిపారు. ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని అన్నారు.