తెలుగు రాష్ట్రాల్లో హాట్‌హాట్ వార్తలతో ఉర్రూతలూగిస్తూ.. రాజకీయ విశ్లేషణలతో సంచలనం రేపుతున్న ఏఎన్‌ఎన్ ఛానెల్ లోగోకు, తెలుగు పత్రికా రంగంలో మరో సంచలనం సృష్టించేందుకు ప్రజల ముంగిటకు త్వరలో వచ్చే మహాపత్రిక ప్రతులకు ప్రత్యేక పూజలు చేశారు.
శనివారం ఏపీలోని అనకాపల్లి జిల్లా వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఏఎన్‌ఎన్ ఛానెల్, మహా పత్రిక రోజురోజుకు విశేష ఆదరణ పొందాలంటూ దీవించారు.