AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోలీస్‌ కొట్టాడని దళితుడి ఆత్మహత్య

న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక పెట్రోల్‌ పోసుకు నిసజీవ దహనం చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. రాంపూర్‌ గ్రామానికి చెందిన కిషన్‌ (32) తన ఫోన్‌ పోయిందని మంగళవారం ఫిర్యాదు చేయడానికి అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు.

ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ సాయిలు తనను కొట్టి పంపించాడని, పీఎస్‌కు వెళ్తే తనకు న్యాయం జరగలేదని, సత్యం చచ్చిపోయిందని, ఎస్సై ప్రవీణ్‌రెడ్డికి సెల్యూట్‌ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి బుధవారం రాత్రి రాంపూర్‌లోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే కిషన్‌ను జోగిపేట దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్సకు సంగారెడ్డి దవాఖానకు తరలించగా అక్కడ మృతిచెందాడు. సూసైడ్‌ నోట్‌ చూసిన కు టుంబ సభ్యులు గురువారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు. పరిస్థితిని గమనించిన సీఐ రేణుకారెడ్డి, ఎస్సై ప్రవీణ్‌రెడ్డి పోస్టుమార్టం నుంచి వచ్చిన శవాన్ని నేరుగా రాంపూర్‌కు తరలించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్‌ హామీతో ఆందోళన విరమించారు.

ANN TOP 10