AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విషాదం.. స్కూల్‌ గేటు మీద పడి ఆరేళ్ల చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ హైస్కూలు గేటు విరిగి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు ముదిరాజ్‌ కాలనీకి చెందిన అజయ్(7)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. హయత్‌నగర్‌లోని జడ్పీ హైస్కూల్‌లో గేటు విరిగి మీద పడటంతో ఒకటో తరగతి బాలుడు మృతిచెందాడు. బాలుడిని అజయ్‌(6)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపించారు.

ANN TOP 10