AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆగ్రా శివారులో కూలిన మిగ్‌ 29 విమానం.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్‌, కో పైలట్‌..

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో వైమానిక దళానికి చెందిన మిగ్ ‌29 విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి పైలట్‌, కోపైలట్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో విమానం నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. పంజాబ్‌ అదంపూర్‌ నుంచి ఆగ్రా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.

మిగ్‌-29 విమానం కూలడానికి కారణాలు తెలియరాలేదు. విమానం ల్యాండింగ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు దీనిపై వైమానిక దళం అధికారికంగా స్పందించలేదు. కాగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలోని ఖాళీ పొలాల్లో పైలట్ విమానం కూలిపోయిందని.. జనావాస ప్రాంతంలో కూలిపోయి ఉంటే భారీ నష్టం జరిగేదని పేర్కొంటున్నారు.

ANN TOP 10