AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశీయ సూచీలకు భారీ నష్టాలు.. రూ.8లక్షలకోట్ల మదుపరుల సంపద ఆవిరి..!

భారతీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం దేశీయ మార్కెట్లపై భారీగా ప్రభావం చూపింది. యూఎస్‌ ఎన్నికల రాజకీయంతో పాటు పెట్టుబడులను విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఉపసంహరించుకోవడంతో మదుపరులు సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దాదాపు ఒకే రోజు రూ.8లక్షల కోట్లకుపైగా సంపదను ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఉదయం క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ పాయింట్ల వద్ద ప్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సేపటికే సెన్సెక్స్‌ 1400 పాయింట్ల వరకు పతనమైంది.

ప్రస్తుతం సెన్సెక్స్‌ 1338 పాయింట్లు పతనమై.. 78385.84 పాయింట్ల వద్ద టేడ్రవుతున్నది. అదే సమయంలో నిఫ్టీ నాలుగు నెలల కనిష్ఠానికి చేరుకున్నది. 448.4 పాయింట్లు పతనమై.. 23,855.95 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది. సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ షేర్లు పడిపోయాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.57 శాతం పతనమైంది. నిఫ్టీ 50 స్టాక్‌ల జాబితాలో కేవలం 9 స్టాక్‌లు మాత్రమే లాభాలతో ప్రారంభం కాగా.. మిగిలిన 41 స్టాక్‌లు పతనమ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 3 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆ తర్వాత సిప్లా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి. టాప్ లూజర్స్‌లో సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.

ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్, ఐఆర్‌సీటీసీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, రేమండ్, సుందరం ఫైనాన్స్, ఏబీబీ ఇండియా 2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇదిలా ఉండగా.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) శుక్రవారం రూ.211.93 కోట్ల విలువైన ఈక్విటీలను వెనక్కి తీసుకున్నారు. విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ నుంచి రూ.94వేలకోట్లు ఉపసంహరించుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.49 శాతం పెరిగి 74.19 డాలర్లకు చేరుకుంది.

ANN TOP 10