AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండొద్దు..

అమితాబ్‌కు సజ్జనార్ కీలక సూచన
బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్‌కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. అమితాబ్, ఇతర సెలబ్రెటీలు ఆమ్వే లాంటి మోసపురిత సంస్దలకు సహకరించవద్దని రిక్వెస్ట్ చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి ఫేక్ సంస్ధలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని అభ్యర్ధించారు. సెలబ్రెటీలు ఎవరూ ఇలా చేయవద్దని సూచించారు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం సరికాదని సజ్జనార్ సూచించారు.

ఈ మేరకు ఆమ్వే సంస్ధలకు సహకరించవద్దని ట్విట్టర్‌లో అమితాబ్ బచ్చన్‌కు ట్యాగ్ చేసి సజ్జనార్ కోరారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. గతంలో క్యూనెట్ లాంటి గొలుసు కట్టు వ్యాపారం చేసే సంస్ధలకు సంబంధించిన యాడ్స్‌లలో నటించవద్దని, అలాంటి కంపెనీలను ప్రమోట్ చేయవద్దని సజ్జనార్ కోరారు. భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ట్యాగ్ చేస్తూ నెల క్రితం సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. క్యూనెట్ లాంటి సంస్దల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ నాశనం అవుతుందని సూచించారు.

ANN TOP 10