యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి క్షేత్రం భక్తజనసంద్రమైంది. కార్తీక మాసం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. వాహనాలతో పార్కింగ్ స్థలం నిండిపోగా క్షేత్రం చుట్టూ ఉన్న రింగ్‌రోడ్డులో కూడా వాహనాలను పార్కింగ్ చేశారు. కార్తీకమాసం పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సత్యదేవుడి వ్రతాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధన స్థలాల్లో భక్తులతో రద్దీ నెలకొంది. కొండపైన గర్భాలయంలో పాంచనారసింహులతోపాటు శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
