ఎప్పుడూ రద్దీగా తిరిగే హైదరాబాద్ మెట్రో రైళ్లకు సాంకేతిక లోపం కారణంగా ఎక్కడికక్కడే మెట్రో రైళ్లు ఆగిపోయాయి. నాగోల్-రాయదుర్గం, LB నగర్-మియాపూర్ మార్గంలో అరగంట నుంచి ఎక్కడి ట్రెయిన్స్ అక్కడ ఆగిపోయాయి. బేగంపేట మెట్రో స్టేషన్ లో దాదాపు 15 నిమిషాల పాటు మెట్రో రైళ్లను ఆపేశారు. దీనికి కారణం సాంకేతిక లోపం అని అధికారులు తెలిపారు. అయితే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మెట్రో రైళ్లకు అంతరాయం ఏర్పడలేదు. 10 గంటల నుంచే సాంకేతిక లోపం కారణంగా ఎక్కడికక్కడే పలు రైళ్లు నిలిచిపోయాయని మెట్రో యాజమాన్యం తెలిపింది.
ఆఫీసులకు వెళ్లే సమయం కావడం.. రైళ్లు ఎంతకీ కదలకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. టెక్నికల్ ఇష్యూ వల్లన ఆగిపోయిన మెట్రో రైళ్లు.. త్వరలోనే యథావిధిగా తిరుగుతాయని మెట్రో అధికారులు వివరించారు. అయితే సాంకేతిక లోపానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మెట్రో ఆగిపోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. చాలా సార్లు ఇలాంటి సమస్యలు తలెత్తాయి. అయిన అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులు రద్దీ భారీగా పెరిగింది. ఇక అమీర పేట్ మెట్రో స్టేషన్‌లో అయితే చెప్పనవసరం లేదు. ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికు ఫ్లాట్ ఫామ్‌లపై నిరీక్షిస్తున్నారు.