AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అక్కినేని వారి పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో ముస్తాబు!

నాగచైతన్య, సమంత విడాకుల తరువాత నాగచైతన్య, కథానాయిక శోభిత దూళిపాళను వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.   కొంత కాలం నుంచి స్నేహంగా ఉంటున్న ఈ జంటకు ఇటీవల ఇరువురి కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ ఇద్దరి పెళ్లి మొదట్లో రాజస్థాన్‌లో జరుగుతుందని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు ఆ వేదిక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోకు షిఫ్ట్‌ అయ్యిందని తెలిసింది. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక పెళ్లి మండపం నిర్మిస్తున్నారట. దీని కోసం సినిమా రంగానికి చెందిన ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌  వర్క్‌ చేస్తున్నారట. డిసెంబరు 4న ఈ ఇద్దరి వివాహం జరగనుందని సమచారం. ఇప్పటికే నాగచైతన్య కొంత మంది స్నేహితులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌ను పంపించాడట.

శోభిత దూళిపాళ ఇంట్లో కూడా ఇంతకు ముందే  పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న తండేల్‌ చిత్రం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.

ANN TOP 10