AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఎనిమిది మంది దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బలరాంపూర్‌ జిల్లాలో అదుపు తప్పి కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. సంఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధా బాగీచా ప్రధాన రహదారిపై ఓ మలుపు వద్ద ఎస్‌యూవీ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే చెరువులోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఆరుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌తో పాటు మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు లారిమా నుంచి పొరుగునే ఉన్న సూరజ్‌పూర్‌ జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, వాహనం వేగంగా వెళ్లడంతోనే నియంత్రణ కోల్పోయి చెరువులోకి దూసుకెళ్లినట్లు తెలిపారు. స్థానికుల సమాచారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని క్రేన్‌ సహాయం బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్ సహా ఎనిమిది మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ మహిళ, మరో చిన్నారి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ANN TOP 10