AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాలువలో పడిన జీపు: ఆరుగురు మృతి

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం సంబల్‌పూర్ జిల్లా పరమాణిక్‌పూర్ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో ఆరుగురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జీపును కాలువ నుంచి బయటకు తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఝార్సుగూడ జిల్లా వాసులుగా గుర్తించారు. సంబల్ పూర్ జిల్లాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు అజిల్ ఖమారి, సుబల్ బోయ్, సుమంత్ బోయ్, సరోజ్ సేత్, దిబ్యా లోహ, రమకాంత్‌బోయ్‌గా గుర్తించారు.

ANN TOP 10