ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులదేనని పదేళ్లు పాలన చేసి ప్రజాస్వామ్యాన్ని పాతర వేసి 10 నెలల ప్రభుత్వంపై బురదజల్లడం సిగ్గుచేటని ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన నాగర్ కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ కానీ రైతులకు తప్పక మాఫీ జరుగుతుందన్నారు. రూ. 1.20 కోట్లతో ఉమామహేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుందని మంత్రి జూపల్లి తెలిపారు.
రైతు భరోసా విషయంలో పంట భూముల్లో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.