AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

6న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్టకు ఈ నెల 6న  సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు సమాచారం. సీఎం 6వ తేదీన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆదివారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని అధికారులను ఆదేశించారు.

ANN TOP 10