AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

KCR కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తెలంగాణ గవర్నర్

బీఆర్ఎస్ పార్టీ ఇటీవల ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలుసు కదా. ఈ సభలో మొత్తం దేశంలోనే ఉన్న గవర్నర్ల వ్యవస్థపై వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు కామెంట్స్ చేశారు. దానిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. వాళ్లు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్.. గవర్నర్ ను పూర్తిగా అవమానించారని ఆమె అన్నారు. రాజ్ భవన్ లో ప్రధాని నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత మీడియాతో ఆమె మాట్లాడారు.

మీరు ముఖ్యమంత్రులు.. గవర్నర్ల వ్యవస్థను అవమానిస్తారు. ప్రోటోకాల్ కు సంబంధించి నేను చాలాసార్లు మాట్లాడాను. కానీ.. సీఎం కేసీఆర్ స్పందించలేదు. ఒకవేళ కేసీఆర్ స్పందిస్తే.. అప్పుడే ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. జనవరి 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో నాకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదు.. అంటూ తమిళిసై స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థపై ఎలా విమర్శలు చేస్తారు.. అంటూ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు.

ANN TOP 10