AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం చంద్రబాబుకు ముద్దు పెట్టబోయిన మహిళ.. అనకాపల్లి టూర్‌లో ఊహించని సన్నివేశం

సినిమా హీరోలు, హీరోయిన్లతో పాటు రాజకీయ నాయకులకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. వీళ్లు ఓకే కానీ.. కొంత మంది డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. తమ అభిమాన నటులను కళ్లారా చూస్తే చాలని కొందరనుకుంటే.. వాళ్లను ఒక్కసారైనా తాకాలి.. హత్తుకోవాలి.. వారితో కలిసి ఓ ఫొటో తీసుకోవాలి.. రెండు మాటలైనా మాట్లాడాలి.. అని డైహార్డ్ ఫ్యాన్స్ తహతహలాడిపోతుంటారు.  అచ్చంగా అలాంటిదే జరిగింది ఏపీలోని అనకాపల్లిలో. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలో ఓ మహిళా అభిమాని ఆయనను కలిసింది. ఆయనతో ఫొటో తీసుకుంది. అంతటితో ఆగకుండా.. ఏకంగా సీఎం చంద్రబాబుకు ముద్దు పెట్టేసింది.

ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సుదీర్ఘ కాలం సీఎంగా చేసిన చంద్రబాబుకు అభిమానులు ఉండటం సహజమే. అయితే.. చంద్రబాబును కలవాలని.. ఆయనతో ఒక్క ఫొటో అయినా తీసుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. కానీ.. సీఎం చంద్రబాబుకు ఉన్న భద్రతా కారణాల వల్ల ఆయన చుట్టూ ఎప్పుడూ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. దీంతో.. చాలా తక్కువ మందికే ఆయనను కలిసేందుకు.. ఫొటో తీసుకునేందుకు ఛాన్స్ వస్తుంటుంది. అలా..  నవంబర్ 02న అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబును కలిసే అవకాశం దక్కించుకుంది ఓ మహిళ అభిమాని.

పర్యటనలో భాగంగా.. చంద్రబాబును చూసేందుకు చాలా మంది టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు వచ్చారు. ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే.. ఓ మహిళా అభిమాని బాబును కలిసేందుకు తెగ ప్రయత్నించింది. చంద్రబాబును కలిసేందుకు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని తప్పించుకుని ఆయన దగ్గరికి దూసుకొచ్చింది. ఆమె అభిమానాన్ని చూసి చంద్రబాబు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. భద్రతా సిబ్బంది మహిళను వారించే ప్రయత్నం చేసినా.. చంద్రబాబు మాత్రం ఆ మహిళను దగ్గరకు తీసుకుని.. అప్యాయంగా పలకరించారు. దీంతో.. తన వెంట తీసుకొచ్చిన పుష్ఫగుచ్చాన్ని అందించింది. అది తీసుకున్న బాబు.. ఆమెతో ఫొటో తీసుకున్నారు.

ANN TOP 10