AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హిజ్రాల వీరంగం.. వ్యాన్ ఆపి డ్రైవర్‌పై దాడి

హిజ్రాలు రెచ్చిపోతున్నారా? తాము అడిగింది ఇవ్వకుంటే దాడులకు తెగబడుతున్నారా? ఇది కేవలం ఏ ప్రాంతానికి పరిమితం కాలేదా? తెలంగాణలో హిజ్రాల హంగామా మరింత ఎక్కువగా ఉందా? అవుననే అంటున్నారు బాధితులు. అసలేం జరుగుతోంది.

హిజ్రాలు ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. ముఖ్యంగా రాత్రిళ్లు, తెల్లవారు జామున వీరి హంగామా అంతా ఇంతా కాదు. లేటెస్ట్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో దీపావళి రోజు రాత్రి ట్రక్కు డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. ఏకంగా డజను మంది హిజ్రాలు డీసీఎం వ్యాన్ డ్రైవర్‌పై ఆపి దాడి చేశారు.

డ్రైవర్ క్యాబిన్ ఎక్కిమరీ వాహనం తాళాలు తీసుకునే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకోలేక సైలెంట్ అయిపోయాడు డ్రైవర్. ఇదే అదునుగా భావించి రెచ్చిపోయారు హిజ్రాలు. మద్యం మత్తులో వాహనదారులను ఆపి పైసా వసూల్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వనివారిపై పైన కనిపించిన విధంగా దాడులకు తెగబడుతున్నారు.

మధిర పట్టణంలో జరుగుతున్న ఈ ఘటనను చూస్తూ సామాన్యులు సైలెంట్ అయిపోయారు. వారి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేకపోయారు. అటువైపుగా వస్తున్న కొంతమంది మీడియా మిత్రులు ఈ తతంగాన్ని బంధించారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

ANN TOP 10