AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికపై చంద్రబాబు నాయుడు కసరత్తు.. రేపు టీడీపీలో చేరనున్న తీగల

టీటీడీపీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడి రేసులో బాబూమోహన్‌, తీగల కృష్ణారెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు.

నెల రోజుల క్రితం చంద్రబాబును బాబూమోహన్‌ కలిశారు. అలాగే, రెండు రోజుల క్రితం ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబును కలిసి పార్టీలో చేరతానని తీగల కృష్ణా రెడ్డి చెప్పారు. ఆదివారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రారంభించింది. జీహెచ్ఎంసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో టీడీపీ ఉంది. వారం పది రోజుల్లో టీటీడీపీ కొత్త అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు. బాబూమోహన్‌ వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బాబూమోహన్‌ బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. అనంతరం కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరారు. అందులో నుంచి టీడీపీలో చేరారు.

ANN TOP 10