లక్ష్మీ పూజలో పాల్గొన్న కంది శ్రీనివాస రెడ్డి దంపతులు
కుటుంబ సభ్యులతో బాణసంచా కాలుస్తూ సంబరాలు
ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆఫీస్ లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య లక్ష్మీ పూజ నిర్వహించారు. అందరికి ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కార్యాలయ ఆవరణలో కుటుంబ సభ్యులతో బాణసంచా కాల్చి పండగ సంబరాలు జరుపుకున్నారు.ఈ సంబరాలలో కంది శ్రీనివాస రెడ్డి కుటుంబసభ్యులతో పాటు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,లోక ప్రవీణ్ రెడ్డి,ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావు, కౌన్సిలర్లు బండారి సతీష్, యెల్మెల్వార్ రామ్ కుమార్, సంద నర్సింగ్, ఆదిలాబాద్ రూరల్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న,నాయకులు కిజర్ పాషా,కందుల సుకేందర్,రాజా లింగన్న,డేరా కృష్ణ రెడ్డి,మానే శంకర్,ఎం.ఏ కయ్యుమ్, మంచాల మల్లయ్య,మొహమ్మద్ రఫీక్,షేక్ ఖలీం, అడ్వకేట్ అఫ్రోజ్ అహ్మద్, మేకల మధుకర్, సంజీవ్ రెడ్డి, యాల్ల పోతా రెడ్డి, ప్రభాకర్, దేవిదాస్, నాగన్న,షేక్ షాహిద్ తదితరులు పాల్గొన్నారు.