తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (TGNAB) డైరెక్టర్ సందీప్ శాండిల్య (Sandeep Sandilya) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సందీప్ శాండిల్య ఆదేశాలతో నార్కోటిక్ బ్యూరో అధికారులు రాష్ట్రంలో తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు.
చర్యల్లో భాగంగానే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇకపై డ్రగ్స్ తీసుకున్న వారిని క్షణాల్లోనే గుర్తించేలా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ హోటల్ వద్ద ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. మూడు లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.ఎస్ఓటీ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాజేంద్రనగర్‌లో కిలాడీ లేడీ అరెస్ట్
రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో భారీగా యాష్ ఆయిల్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. బండ్లగూడలో 300 గ్రాముల యాష్ ఆయిల్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా యాష్ ఆయిల్ విక్రయిస్తున్న లేడి కిలాడిని చాకచక్యంగా పట్టుకున్నారు. విశ్వాసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడి ఇంట్లో సోదాలు చేశారు. చిన్న చిన్న బాటిల్స్‌లో యాష్ ఆయిల్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న యాష్ ఆయిల్‌ను సీజ్ చేసి, లేడి కిలాడిని అరెస్ట్ చేశారు. ఎన్టీపీఎస్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి నార్కోటిక్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.