AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దీపావళి నాడు మరో శుభవార్త .. ఏంటంటే..

హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి నాడు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్‌లోని 100 పడుకల ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దీపావళి కానుకగా ప్రకటించింది. రూ. 82.00 కోట్లను రేవంత్ ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ మేరకు రాష్ట్ర హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది.. హుస్నాబాద్‌కి 250 పడకల ఆస్పత్రి రావడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. హుస్నాబాద్ ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మార్చడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహలకు ధన్యవాదాలు తెలిపారు.

పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీపావళి పండగ కానుకగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు తెలిపిందని అన్నారు. ప్రస్తుతం 100 పడకలతో ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రిని 250 పడకల దవఖానాగా మారుస్తూ జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

ANN TOP 10