AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉద్యోగులకు 3.64శాతం పెంచిన ప్రభుత్వం.. 17 వాయిదాల్లో చెల్లింపు..!

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. డీఏ 3.64శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జూలై ఒకటో తేదీ నుంచి వర్తించనున్నది. డిసెంబర్‌ ఒకటిన చెల్లించే నవంబర్‌ జీతంతో కలిపిన పెరిగిన డీఏ ప్రభుత్వం చెల్లించనున్నది. 2022 జులై ఒకటి నుంచి ఈ నెల వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయనున్నది.

సీపీఎస్‌ ఉద్యోగులకు డీఏ బకాయిలు 10శాతం ప్రాన్‌ ఖాతాకు జమవుతాయి. సీపీఎస్‌ ఉద్యోగులకు మిగతా 90శాతం 17 వాయిదాల్లో చెల్లించనున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు 2025 ఫిబ్రవరి నుంచి 17 వాయిదాల్లో చెల్లించినట్లు ప్రభుత్వ పేర్కొన్నది. జీపీఎఫ్‌ ఖాతాలు లేని ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌ ఉద్యోగులకు సైతం 17 వాయిదాల్లో చెల్లించనున్నది. రిటైర్డ్‌ ఉద్యోగులకు డీఏ బకాయిలను జనవరి నుంచి 17 వాయిదాల్లో జమ చేయనున్నది.

ANN TOP 10