AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాసేపట్లో.. పోలీసుల విచారణకు హాజరు కానున్న రాజ్ పాకాల

ఫాంహౌస్‌ ఘటనలో  కేటీఆర్‌  బావమరిది రాజ్ పాకాల  మోకిలా పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. బుధవారం మధ్యాహ్నం   మోకిలా పీఎస్‌లో (Mokila PS) తన అడ్వొకేట్‌తో కలిసి విచారణకు హాజరుకానున్నారు. హైకోర్టు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియటంతో ఈరోజు విచారణకు రాజ్ పాకాల హాజరవుతున్నారు. కాగా మంగళవారం రాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఆయన కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని ఫోన్ స్వాధీనం చేసుకొనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే అందుబాటులో లేరు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పలువురికి పోలీసులు నోటీసులు జారీచేసి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఇవాళ మోకిల పోలీసుల విచారణ కీలకంగా మారనుంది.

కాగా కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఫాంహౌస్‌ ఘటనలో మోకిల పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఫాంహౌస్‌ పార్టీలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులు పోలీసుల నోటీసులకు స్పందించి, మంగళవారం స్టేషన్‌కు వచ్చారు. వారి స్టేట్‌మెంట్‌‌ను రికార్డు చేసి పంపారు. ఇప్పటి వరకు 9 మందిని విచారించినట్లు పోలీసులు తెలిపారు. రోజూ ఐదుగురికి నోటీసులిచ్చి, వారి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయనున్నట్లు చెప్పారు. మహిళలకు ఇంకా నోటీసులు ఇవ్వలేదని, త్వరలో వారికీ నోటీసులిచ్చి విచారించనున్నారు. ఫాంహౌస్‌ యజమాని రాజ్‌ పాకాలతో పాటు విజయ్‌ విచారణకు సహకరిస్తారా.. లేదా.. అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వీరిద్దరూ పోలీసుల విచారణకు సహకరిస్తేనే కేసు దర్యాప్తు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఫాంహౌస్‌ పార్టీలో కొకైన్‌ సేవించి, పట్టుబడిన విజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఆయన భార్య పక్కనే ఉన్నారు. ఆమెకు తెలిసిన ఓ మహిళ మొబైల్‌ను విజయ్‌ తన ఫోన్‌ అని చెప్పి, పోలీసులకు అందజేశారు. విజయ్‌కి ఆదివారం పోలీసులు 41సీఆర్‌పీసీ నోటీసులిచ్చిన తర్వాత స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారు.

ANN TOP 10