పెండింగ్ బిల్లులు చేసేందుకు ఓ ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ మెడికల్ కాలేజీ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాలు.. కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ ఏజెన్సీ ద్వారా 49 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు వైద్య కళాశాల అకౌంట్స్ ఆఫీసర్ ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ సదరు ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి రూ.7 లక్షలు డిమాండ్ చేయగా రూ.3 లక్షలు చెల్లిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
