AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌ను చంపాలని చూసిండ్రు… షబ్బీర్‌ అలీ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌ మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జన్వాడ ఫాంహౌస్‌ వాస్తవాలు బయటపెట్టినందుకు నాడు ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డిని 40 రోజులు జైల్లో వేసి.. అండర్‌ట్రయల్‌ ముద్దాయిగా ఉంచి.. చంపాలని చూశారని ఆరోపించారు.

తన బావమరిది ఫామ్‌ హౌస్‌ లో జరిగిన పార్టీపై బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ. ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేటీఆర్‌ జన్వాడ ఫాంహౌస్‌ వాస్తవాలను నాడు ఎంపీగా ఉన్న రేవంత్‌ రెడ్డి బయటపెట్టారని చెప్పారు. అసలు విషయాలను బయటపెట్టినందుకు రేవంత్‌ రెడ్డిని 40 రోజులు జైల్లో ఉంచారని.. అండర్‌ట్రయల్‌ ముద్దాయిగా ఉంచి.. చంపాలని చూశారని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

డ్రగ్స్‌ టెస్ట్‌ చేసుకో కేటీఆర్‌…
వెంటనే కేటీఆర్‌ నార్కోటిక్‌ పరీక్షలు చేయించుకొని.. తాను డ్రగ్స్‌ తీసుకోలేదని నిరూపించుకోవాలని అన్నారు షబ్బీర్‌ అలీ. అలాగే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబం అక్రమంగా లక్షల కోట్లు దోచుకుందని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు 50 మంది ఆస్తులపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మొన్న కేటీఆర్‌ బావమరిది ఫామ్‌ హౌస్‌ లో పక్క సమాచారం తోనే పోలీసులు దాడులు చేశారని అన్నారు. ఇందులో రాజకీయ లబ్ధి కోసం చేసింది ఏమీ లేదని చెప్పారు. ఇంట్లో దావత్‌ చేసుకున్నామని చెబుతున్న కేటీఆర్‌.. విదేశీ మద్యం అక్కడికి అక్రమంగా ఎలా వచ్చిందని నిలదీశారు.

కేటీఆర్‌ ఖేల్‌ ఖతమే..
కేటీఆర్‌ పై నిప్పులు చెరిగారు మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి. 16 విదేశీ మద్యం సీసాలతో దొరికిన తన బావమరిది రాజ్‌ పాకాలను వెనకేసుకొస్తే.. కేటీఆర్‌ రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయమని అన్నారు. గత తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ కు విదేశీ మద్యానికి అనుమతి తీసుకోవాలని తెలియదా? అని ప్రశ్నించారు. తన బావమరిది రాజ్‌ పాకాల ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ వాడినట్లు అభియోగం ఉందని.. దానిపై కేటీఆర్‌ సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే యెన్నం డిమాండ్‌ చేశారు.

ANN TOP 10