AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వేణుస్వామికి బిగ్‌ షాక్‌.. వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం

ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చే తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. నాగ చైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ సమయంలో వేణు స్వామి జ్యోతిష్యం చెప్పారు. శుభమా అంటూ ఎంగేజ్మెంట్ జరుగుతుండగా, వేణు స్వామి మరోవైపు వారు విడిపోతారంటూ కామెంట్స్ చేశారు. దీనితో వేణు పై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

అనంతరం కమిషన్ ముందు వేణు స్వామి హాజరుకావాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. మిషన్ కు ఆ అధికారం లేదంటూ హైకోర్టుకు వెళ్లి వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టులో జరిగిన విచారణ సంధర్భంగా ఆ స్టే ఎత్తివేస్తూ, కమిషన్ కు పూర్తి అధికారాలు ఉన్నాయని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. అలాగే వారం రోజుల్లో వేణుపై తదుపరి చర్యలు తీసుకోవాలని కమిషన్ ను న్యాయస్థానం ఆదేశించింది.

ANN TOP 10