దీపావళికి ముందుగా గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ వచ్చేసింది. భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి కూడా బంగారం ధర బాటలోనే పయనిస్తున్నాయి. రెండు రోజులుగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 820 పెరిగ్గా.. 22 క్యారెట్ల బంగారం రూ. 750 మేరకు పెరిగింది. ఇక ఆదివారంతో పోలిస్తే.. సోమవారం స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
దీపావళికి ముందు ఇలా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో.. గోల్డ్ లవర్స్ కొనుగోలు సిద్దమయ్యారనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం లాంటి అంశాలు ఈ బంగారం ధరలు హెచ్చుతగ్గులపై ప్రభావం చూపిస్తున్నాయ్. సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,590
విజయవాడ – రూ.73,590
బెంగళూరు – రూ.73,590
ముంబై – రూ.73,590
కోల్‌కతా – రూ.73,590
ఢిల్లీ – రూ.73,740
చెన్నై – రూ.73,590
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.80,280
విజయవాడ – రూ.80,280
బెంగళూరు – రూ.80,280
ముంబై – రూ.80,280
కోల్‌కతా – రూ.80,280
ఢిల్లీ – రూ.80,430
చెన్నై – రూ.80,280









