AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీసీ ఫుటేజ్‌ను వెంటనే బయటపెట్టండి..

వెంటనే సీసీ ఫుటేజ్‌ను రిలీజ్‌ చేయాలి

రేవ్‌పార్టీపై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు డిమాండ్‌
రేవ్‌ పార్టీలు, రావ్‌ల పార్టీల పేరుతో విచ్చలవిడిగా డ్రగ్స్‌ దందా అంటూ వ్యాఖ్యలు..

మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు జన్‌వాడ రేవ్‌పార్టీపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఒక వైపు డ్రగ్స్‌ రహిత తెలంగాణా చేస్తామని ప్రకటిస్తోందని.. మరోవైపు శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్‌ పార్టీలు, రావ్‌ల పార్టీల పేరుతో విచ్చలవిడిగా డ్రగ్స్‌ దందా జరుగుతోందన్నారు.

గజ్వేల్‌ పట్టణంలో రఘునందన్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. విదేశీ మాదక ద్రవ్యాలతోపాటు, కొకైన్‌ లు విచ్చలవిడిగా తెచ్చి భాగ్యనగరంలో డ్రగ్స్‌ దందా చేస్తున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ శివార్లలో బాగా ఫేమస్‌ అయిన ఫాంహౌస్‌ లో అర్ధరాత్రి రేవ్‌ పార్టీ జరుగుతుందని, వీఐపీల పిల్లలు ఉన్నారని అనేక వార్తలు వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఫాంహౌస్‌ ఒనర్‌ తో కుమ్మక్కు కాకపోతే డీజీపీ ఆ ఫాంహౌస్‌ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్‌ ను వెంటనే రిలీజ్‌ చేయాలని రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు.

జన్వాడలోని ఫాంహౌస్‌పై సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడి రిజర్వ్‌ కాలనీలో ఉన్న రాజ్‌ పాకాల ఫాంహౌస్‌ లో శనివారం రాత్రి పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా రేవ్‌ పార్టీ నిర్వహిస్తుండటంతో పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని వారికి డ్రగ్స్‌ పరీక్ష నిర్వహించారు. వీరిలో ఒకరికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొకైన్‌ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో కేసు నమోదు చేశారు. విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఫామ్‌ హౌస్‌ కేటీఆర్‌ మావమరిది ది. దీంతో ఈ ఫామ్‌ హౌస్‌ చుట్టూ ఉన్న సీసీ పులేజీలను వెంటనే రిలీజ్‌ చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు.

డీజీపీ జితేందర్‌ వివరాలు వెల్లడించాలి..
రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ జితేందర్‌ ను డిమాండ్‌ చేస్తున్న.. 12 గంటలలో సీసీ ఫుటేజ్‌ రిలీజ్‌ చేయాలి. ఫాంహౌస్‌ లో ఎస్వోటీ పోలీసులు రైడ్‌ చేసినప్పుడు ఫాంహౌస్‌ లో, బయట ఉన్న పుటేజ్‌ లు రిలీజ్‌ చేయాలని రఘునందన్‌ రావు అన్నారు. ముఖ్యమంత్రి జన్వాడ ఫాంహౌస్‌ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌ లు రాజీ పడ్డారని వార్తలు వస్తున్నాయి.   ప్రెస్‌ మీట్‌ పెట్టాలి, లేదంటే సీసీ ఫుటేజ్‌ ఎడిటింగ్‌ చేస్తారు. రేవంత్‌ రెడ్డి పొల్యూట్‌ కాకపోతే జన్వాడ ఫాం హౌస్‌ లో శనివారం రాత్రి ఏం జరిగింది ప్రజలకు తెలియజేయాలని రఘునందన్‌ రావు అన్నారు.

ANN TOP 10