భగ్నం చేసిన పోలీసులు..
కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ
విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్ స్వాధీనం
పట్టుబడినవారిపై కేసులు నమోదు..
నగర శివారులోని జన్వాడ ఫాంహౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్‌లోఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు ఆదివారం రాత్రి పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలు,35 మందితో లిక్కర్ పార్టీ జరుగుతోంది. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుగుతోంది. విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10.5 లీటర్స్ విదేశీ మద్యం, 10 లూజ్ ఇండియన్ లిక్కర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిపై ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

మద్ధూరి విజయ్ అనే వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్..
ఈ పార్టీలో మద్దూరి విజయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి బ్లడ్ శాంపిల్స్‌ని టెస్ట్‌కి పంపగా.. కొకైన్ తీసుకున్నట్లు తేలడంతో అరెస్ట్ చేసి ఏటీబీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రేవ్ పార్టీ నిర్వహించిన రాజ్ పాకాలపై ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులతో పాటు ఎక్సైజ్ శాఖ పోలీసులు బృందాలు పాల్గొన్నాయి.









