AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భవిత భాగ్యనగరిదే .. డిప్యూటీ సీఎం భట్టీ

హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చూసి ఓర్వలేకనే కొందరు విషప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం హైటెక్స్‌లో జరిగిన నరెడ్కో నిర్వహించిన ప్రాపర్టీ షోను భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్టాళ్లను సందర్శించిన నగర స్థిరాస్తి రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, నిర్మాణ రంగంపై ఉన్న అపోహలు వీడాలని బిల్డర్లకు సూచించారు.

భవిష్యత్ నగరం ఇదే..
హైదరాబాద్ నగరాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని డిప్యూటీ సీఎం వివరించారు. నగరాభివృద్ధికి బడ్జెట్‌లో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. నగరవాసులకు మంచినీటి ఎద్దడి లేకుండా గోదావరి, కృష్ణ ,మంజీరా నదుల నుంచి తాగునీరు అందిస్తున్నామని వివరించారు. సుమారు 30 వేల ఎకరాలలో అద్భుతమన ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు గ్రీన్ బెల్ట్ గా ఉంటుందన్నారు. ఫోర్త్ సిటీలోని స్పోర్ట్స్, హెల్త్, స్కిల్ హబ్‌ల రాకతో భాగ్యనగరపు రూపురేఖలు సమూలంగా మారబోతున్నాయని తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకునేలా ఏర్పా్ట్లు, అక్కడ ఏర్పాటు చేయబోయే ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, AI ఆధారిత సంస్థలు ప్రపంచ పటంలో నగరానికి కొత్త గుర్తింపును తేబోతున్నాయన్నారు.

ANN TOP 10