జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఇంటికి చేరుకున్నట్లుగా తెలుపుతూ ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ఎమోషనల్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘యానిమల్’ సినిమాలోని ‘నాన్న’ సాంగ్ ప్లే అవుతుండగా.. జానీ మాస్టర్ తలుపుతట్టి ఇంట్లోకి వెళ్లడం, ఇద్దరూ పిల్లలు హత్తుకుని ఎమోషనల్ అవడం, ఆ తర్వాత భార్య హత్తుకోవడం, జానీ మాస్టర్ కళ్లలో నీళ్లు, భార్య వాటిని తుడవటం వంటి ఎమోషనల్ సన్నివేశాలున్న ఈ వీడియోని స్వయంగా జానీ మాస్టరే షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) శుక్రవారం హైదరాబాద్ చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 37 రోజుల తర్వాత చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ బెయిల్‌తో బయటికి వచ్చారు. జానీ మాస్టర్ జైలు నుంచి బయటికి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంటికి చేరుకున్న జానీ మాస్టర్ కుటుంబ సభ్యులను చూసి కంటతడి పెట్టుకున్నారు. భార్య, పిల్లలని హత్తుకుని, వారిపై ప్రేమ కురిపించారు.









