(అమ్మన్యూస్, ఆదిలాబాద్):
ఆదిలాబాద్ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు రూ.10కోట్లు మంజూరైనట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఆర్‌ఆర్ ప్లేన్ గ్రాంట్స్ కింద బీటీ డోడ్, బ్రిడ్జి పనుల నిమిత్తం రూ.10 కోట్లు విడుదల అయ్యాయని అన్నారు. గతంలో నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి పంచాయతీ రాజ్, స్త్రీ మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి,జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు లేఖల ద్వారా ప్రపోజల్స్ పంపినట్టు ఆయన తెలిపారు.

ప్రస్తుతం రూ. 10 కోట్లు విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కకు కంది శ్రీనివాస రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలోనే ప్రపోజల్స్ లో మిగతా అభివృద్ధి పనులకు నిధులు దాదాపు రూ.120 కోట్ల వరకు విడుదల అయ్యే అవకాశముందని ఆయన తెలిపారు. అయితే ఈ నిధుల ద్వారా నియోజక వర్గంలోనీ ఆదిలాబాద్ రూరల్, జైనథ్, బేల మండలాల్లో అభివృద్ధి పనులకు వెచ్చించనున్నట్లు కంది శ్రీనివాసరెడ్డి వివరించారు.









