AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్యాట్‌ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లు.. మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ

తమను ఏపీకి కేటాయించడంపై నలుగురు ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్‌ తీర్పును సవాలు చేస్తూ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణకు అనుమతించింది. ఐఏఎస్‌ల పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనుంది.

రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపుపై గతంలో జారీ అయిన ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జారీచేసిన ఉత్తర్వులపై ఇటీవల ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, కే ఆమ్రపాలి, ఏ వాణీ ప్రసాద్‌, డీ రొనాల్డ్‌రాస్‌, జీ సృజన, హరికిరణ్‌, శివశంకర్‌ క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై క్యాట్‌ సభ్యులు లతా బస్వరాజ్‌ పట్నే, శాలినీ మిశ్రాతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన స్థానాల్లో ఈ నెల 16లోగా విధుల్లో చేరాలని మంగళవారం తేల్చి చెప్పింది. దీంతో క్యాట్‌ తీర్పును సవాలు చేస్తూ నలుగురు ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించారు.

ANN TOP 10