పండుగపూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన చర్ల మండలం తేగడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తాలిపేరు నదిలో(Taliperu river) స్నానానికి వెళ్లారు.
ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, పండుగుపూట ఒకేసారి ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.