AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌కు ఈడీ బిగ్‌ షాక్‌!.. జీఎస్టీ స్కామ్‌ పై ఈడీ కేసు నమోదు

జీఎస్టీ చెల్లింపుల్లో రూ.46 కోట్లకుపైగా అవకతవకలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కు ఈడీ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ స్కామ్‌ పై ఈడీ కేసు నమోదు చేసింది. జీఎస్టీ చెల్లింపుల్లో రూ.46 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే దీనిపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలు ఏంటి ఈ కేసు…
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) లావాదేవీల్లో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపునకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌పై హైదరాబాద్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. రూ. 1,000 కోట్లకు పైగా విలువైన ఈ కుంభకోణం నాలుగేళ్ల క్రితం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రభుత్వంలో కుమార్‌ రెవెన్యూ (వాణిజ్య పన్నులు) స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన తర్వాత, ఆదాయాన్ని ఆర్జించే అన్ని శాఖలకు ఆయనే ఇ¯Œ ఛార్జ్‌గా కొనసాగారు.

సోమేశ్‌తో పాటు మరో ముగ్గురు..
సోమేశ్‌ కుమార్, మరో ముగ్గురు వ్యక్తులు, ఒక సంస్థ జీఎస్టీ చెల్లింపుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ఖజానాకు రూ. 1,000 కోట్లకు పైగా నష్టం చేకూర్చారని వాణిజ్య పన్నుల జాయింట్‌ కమిషనర్‌ కె. రవికుమార్‌ పోలీసు డిటెక్టివ్‌ విభాగానికి ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుపై చర్య తీసుకున్న పోలీసులు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ. శివ రామ ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు.

ANN TOP 10