భారత కుబేరుల్లో టాప్ 100 మంది సంపన్నుల్లో అత్యంత సంపన్నుడుగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ పత్రిక గురువారం దేశంలోని టాప్ 100 మంది సంపన్నుల జాబితా విడుదల చేసింది. ఈ టాప్ 100 మంది సంపన్నుల ఉమ్మడి సంపద విలువ ఈ ఏడాది లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని దాటి 1.1 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. 2019 సంవత్సరం నాటి నికర విలువ 31,600 కోట్ల డాలర్లతో పోల్చితే ఇది రెండు రెట్లు అధికం. గత 12 నెలల కాలంలోనే వారి నికర విలువకు 31,600 కోట్లు జోడయింది.
ఫోర్బ్స్ టాప్-5 కుబేరులు
ర్యాంక్ పేరు సంపద విలువ (కోట్ల డాలర్లు)
1. ముకేశ్ అంబానీ 11,950
2 గౌతమ్ అదానీ కుటుంబం 11,600
3. సావిత్రి జిందాల్ 4,370
4. శివ్ నాడార్ 4,020
5. దిలీప్ సంఘ్వి కుటుంబం 3,240
జాబితాలో తెలుగు పారిశ్రామికవేత్తలు
29 మురళి కె దివీ 920
70 పీపీ రెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి 450
78 జీఎం రావు 399
81 బీ పార్థసారధి రెడ్డి 395
82 పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి 390
87 డాక్టర్ రెడ్డీస్ కుటుంబం 367
94 సీ ప్రతాప్ రెడ్డి 352
100 మహిమ దాట్ల 330