AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘జియో ఫైనాన్స్’ యాప్ లాంచ్.. రిలయన్స్ మరో కీలక అడుగు

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక అడుగు వేసింది. జియో ఫైనాన్స్ పూర్తి స్థాయి యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా వివిధ రకాలు ఫైనాన్స్ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్లాట్ ఫామ్ ఫీ లేకుండా రీఛార్జులు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే 5 నిమిషాల్లోనే సేవింగ్ ఖాతా పొందొచ్చని, యూపీఐ పేమెంట్లు సహా మెరన్నో సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

మీరు గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు ప్లాట్‌ఫామ్ ఫీ చెల్లించాల్సి వస్తోందా? అయితే మీరు వెంటనే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఎలాంటి ప్లాట్ ఫామ్ ఫీ లేకుండా రీఛార్జ్ చేసుకోవచ్చు. అదే జియో ఫైనాన్స్ యాప్. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services) ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే జియో ఫైనాన్స్ పేరుతో సరికొత్త ఫైనాన్షియల్ యాప్‌ను లాంచ్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని శుక్రవారం వెల్లడించింది. అలాగే మై జియోలోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులు అందించేందుకు జియో ఫైనాన్స్ బీటా వర్షన్ యాప్‌ను ఈ ఏడాది 2024, మే 30వ తేదీనే లాంచ్ చేసింది రిలయన్స్. అన్ని విధాలుగా యాప్ పనితీరును నిర్దారించుకున్న తర్వాత, వినియోగదారుల సూచనలు, సలహాల మేరకు తాజాగా పూర్తి స్థాయి ఫైనాన్స్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో జియై ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించింది. ఈ యాప్ ద్వారా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఈ-డిజిట్ సేవింగ్ ఖాతా ఓపెన్ చేయవచ్చని పేర్కొంది. బయోమెట్రిక్, ఫిజికల్ డెబిట్ కార్డు ద్వారా ఈ బ్యాంక్ ఖాతా తీసుకొవచ్చని పేర్కొంది.

జియో ఫైనాన్స్ యాప్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్లు, బిల్లుల పేమెంట్లు, ఇన్సూరెన్స్ సేవలు పొందొచ్చని కంపెనీ తెలిపింది. మొబైల్ రీఛార్జులు, క్రెడిట్ కార్డు బిల్లల చెల్లింపులు వంటివి సైతం ఇందులో ఉన్నాయని సూచించింది. అలాగే తమ బ్యాంకు ఖాతాల్లోని బ్యాలెన్స్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం సైతం కల్పిస్తున్నట్లు తెలిపింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10