AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నగరం ఖాళీ..! పల్లెకు పట్నం పయనం… రోడ్లన్నీ నిర్మానుష్యం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
దసరా పండగ వేళ.. భాగ్యనగరం నిర్మానుష్యంగా మారింది. పండగ కోసం నగర ప్రజలు స్వస్థలాలకు వెళ్లారు. దీంతో నగరంలోని రహదారులన్నీ బొసిపోయాయి. అలాగే నగరంలోని ఆర్టీసీ బస్సులు సైతం ప్రయాణికులు లేకుండా ఖాళీగా తిరుగుతున్నాయి. దసరా పండగ నేపథ్యంలో వరుసగా సెలవులు రావడంతోపాటు నగర జీవులు.. వారి వారి స్వస్థలాలకు పయనమయ్యారు.

రైళ్లు, బస్సులు కిటకిట..
బుధవారమే హైదారాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రజలు పయనమయ్యారు. దాంతో రైళ్లు, బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక హైదరాబాద్‌ నగరం నుంచి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అలాగే దక్షిణ మధ్య రైల్వే సైతం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు
ఇంకోవైపు విజయవాడ, బెంగళూరు, వరంగల్‌ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ ప్లాజా వద్ద బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు భారీగా బారులు తీరాయి. రైళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో ప్రయాణికులు.. ప్రైవేట్‌ బస్‌ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్‌ బస్‌ సర్వీస్‌ ఆపరేటర్లు టికెట్‌ రేట్లను భారీగా పెంచేశారు.

దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రయాణికులు.. ప్రైవేట్‌ బస్సును ఆశ్రయిస్తున్నారు. మరోపైపు దసరా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇవి ఈ నెల 14వ తేదీతో ముగియనున్నాయి. దాంతో నగరాన్ని విడిచి వెళ్లిన వారంతా మంగళ, బుధవారాల్లో మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం కానున్నారు.

ANN TOP 10