(అమ్మన్యూస్, హైదరాబాద్):
బీఆర్ఎస్ అగ్రనాయకుడు కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఆయనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ కేటీఆర్ ఇప్పటికే లీగల్ నోటీస్ ను మంత్రికి పంపారు. అయితే ఆమె నుంచి ఆ నోటీస్ కు ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇక న్యాయ పోరాటానికి దిగారు కేటీఆర్.. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వర రావు ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ ను కేటీఆర్ సాక్షులుగా పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్‌లో పిటిషన్∙వేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. కేటీఆర్ వేసిన పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది.