AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ర‌తన్ టాటా మ‌ర‌ణం దేశానికి తీర‌ని లోటు … రేవంత్ రెడ్డి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. ఆయన నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు.

రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమని అన్నారు.

టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ANN TOP 10