AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

  • పొలానికి బైక్ పై వెళ్లి తిరిగొస్తుండగా ఘటన
  • బైక్ ను ఢీకొట్టిన కర్ణాటక ఆర్టీసీ బస్సు
  • మృతుల స్వగ్రామంలో తీవ్ర విషాదం

కర్నాటక బస్సు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండల పరిధిలోని గణేష్‌పూర్‌ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గునెల్లి సిద్రాం(70), అతని అల్లుడు బిరాదర్‌ జగన్నాథం(40), కూతురు రేణుక(34), మనుమడు వినయ్‌కుమార్‌(14) సోమవారం మోటారు సైకిల్‌పై పొలానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో బీదర్‌–జహీరాబాద్‌ రోడ్డుపై జహీరాబాద్‌ నుంచి బీదర్‌ వైపు వేగంగా వెళ్తున్న ఔరాద్‌ డిపో బస్సు మోటారు సైకిల్‌ను ఢీకొన్నది.

దీంతో మోటారు సైకిల్‌పై వెళుతున్న వారు చెల్లాచెదురుగా పడిపోయారు. సిద్రాం అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన జగన్నాథం, రేణుక, వినయ్‌కుమార్‌లను సమీపంలోని బీదర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ కొద్ది సేపటికే వీరంతా మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం పట్ల గణేష్‌పూర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు ఘటన స్థలాన్ని జహీరాబాద్‌ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, రూరల్‌ సీఐ హన్మంత్‌ పరిశీలించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10