AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడే సీతారాముల కల్యాణోత్సవం..

సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాద్రి..
కల్యాణం కమనీయం-ఈ సమయం అతి మధురం-ఈ పాట పాడుకునే సమయం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. రాములోరి పెళ్లికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది భద్రాద్రి. మరికొద్ది గంటల్లోనే సీతమ్మ మెడలో తాళి కట్టనున్నారు శ్రీరాముడు. భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను ఇప్పుడు చూద్దాం.

నిజంగానే ఎంత కమనీయం.. ఎంత రమణీయం.. సీతారాముల కల్యాణ వైభోగం.. రాములోరి కల్యాణోత్సవానికి దక్షిణ అయోధ్య ముస్తాబైంది. సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఎటుచూసినా ఆధ్మాత్మికత ఉట్టిపడుతోంది. విద్యుత్‌ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది భద్రాచలం రామాలయం.

అభిజిత్‌ లగ్నంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల మధ్య కల్యాణ క్రతువు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.

భద్రాచలం మిథిలా స్టేడియంలో నిర్వహిస్తోన్న సీతారాముల కల్యాణోత్సవానికి సకల ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్‌ అనుదీప్. భక్తులంతా వీక్షించేలా అరేంజ్‌మెంట్స్‌ చేశారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వీఐపీలకు సెపరేట్‌ వింగ్స్‌ పెట్టారు. లడ్డూలు, తలంబ్రాలు అందించేందుకు 70 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక, భద్రత కోసం 2వేల మంది పోలీసులను గ్రౌండ్‌లో మోహరించారు.

సీతారాముల కల్యాణం తర్వాత రేపు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై హాజరు కానున్నారు.

ANN TOP 10