AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీవితం అంటే ఇంతే! ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం..

ఈ స్పష్టిలో మనిషి జీవితం వింతైనది. ఎప్పుడు పుడతామో.. ఎప్పుడు చనిపోతామో కూడా తెలీదు. నెక్ట్స్ మినెట్‌ కూడా మన కంట్రోల్‌లో ఉండదు. కొన్ని సార్లు మనతో ఉండేవారు అప్పటి వరకు బానే ఉంటారు.. కానీ అనూహ్యంగా గుండెపోటు వచ్చి కిందపడి చనిపోతారు. మరికొందరు నిద్రలోనే మరణిస్తారు. ఇలా మన నిత్య జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఓ వృద్ధుడు బస్టాండ్‌లో మృతిచెందాడు.

ఈ ఘటన నాగర్‌కర్నూల్‌లో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్‌లోని బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఊపిరి వదిలాడు. అడగుల మండలం కొనగల్ గ్రామానికి చెందిన కొమ్ము వెంకటయ్య (70) అనే వృద్ధుడు తన భార్య వెంకటమ్మతో దర్గాకు వెళ్లాలని నాగర్‌కర్నూల్ బస్టాండ్‌కు చేరుకున్నారు. ఇక బస్సు స్టాండ్‌లో కల్వకుర్తి బస్సు కోసం ఎదురు చూసున్నారు ఆ వృద్ధ దంపతులు.. ఇంతలో బస్సు రానే వచ్చింది..దీంతో భార్య వెంకటమ్మ అయ్యా లేవయ్యా బస్సొచ్చింది అని భర్తను పిలిచింది. ఎంత పిలిచినా లేవకపోవడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. అక్కడికి హుటాహుటిన చేరుకున్న వైద్యులు అతడు మృతిచెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయంపై కొందరు రకలరకలుగా స్పందిస్తున్నారు. మనషి జీవితాన్ని ఎవరు ఊహించలేరని, అందుకే ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయాలని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరెమో మనిషి జీవితం చాలా చిన్నదని, దాన్ని అందరూ ఆస్వాదించాలని పేర్కొంటున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10