AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వ్యాపారి జాడగల్లంతు.. బ్రిడ్జిపై డ్యామేజీ అయిన కారు

మంగళూరు: కర్ణాటకలోని ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ (BM Mumthaz Ali) ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోవడం, ఆయన బీఎండబ్ల్యూ (BMW) కారు ఒక బ్రిడ్జి వద్ద బాగా డ్యామేజ్ అయి కనిపించడం కలకలం సృష్టించింది. దీనిపై మంగళూరు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడైన ముంతాజ్ అలీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలలో తన ఇంటి నుంచి కారులో బయలుదేరాడని, 5 గంటల సమయానికి కులూర్ వంతెన వద్ద ఆగారని చెబుతున్నారు. ఆయన బీఎండబ్లూ కారు డ్యామేజ్ అయినట్టు కనిపిస్తోందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. ఆయన వంతెన పైనుంచి పక్కనే ఉన్న నదిలోకి దూకేసి ఉండవచ్చనే అనుమానంతో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ బృందాలు రంగంలోకి దిగినట్టు చెప్పారు.

”కులూరు వంతెన వద్ద వ్యాపారవేత్త ముంతాజ్ అలీ కారు కనిపించినట్టు తెల్లవారుజామున మాకు సమాచారం వచ్చింది. ఆయన బ్రిడ్జి నుంచి దూకేసి ఉండవచ్చు. స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు” అని అనుపమ్ అగర్వాల్ తెలిపారు. కారు ప్రమాదానికి గురైనట్టు అనుమనిస్తున్నామని అన్నారు. తన తండ్రి కనిపించడం లేదని అలీ కుమార్తె తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇచ్చిందన్నారు. దర్యాప్తు తరువాత మరిన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

ANN TOP 10