AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి ఆదివారం ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొనున్నారు. చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు ఉంకూడదనే టార్గెట్‌గా కేంద్రం పని చేస్తోంది. మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రానికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అగ్ర నేతలను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనేది అగ్ర నేతలతో చర్చించే అవకాశం ఉంది. రేవంత్‌ రెడ్డి తిరిగి మంగళవారం హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.

‘ పీసీసీ నియామకం పూర్తవడంతో ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణపై అందరి దష్టి ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజమాబాద్‌ జిల్లాకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ జిల్లాలకు చెందిన వారికి మంత్రి పదవులు పక్కాగా తెలుస్తోంది. మంత్రి పదవులపై ఎమ్మెల్యేలు లాబీయింగ్‌ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలో యాదవులు, ముదిరాజ్‌ లకు కూడా ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు వస్తాయని చూస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గేను ఆయన పరామర్శించారు. అప్పుడే మంత్రి వర్గ విస్తరణపై వార్తలు వచ్చాయి. కానీ సీఎం ఎలాంటి చర్చలు చేయకుండానే తిరిగి వచ్చారు.

ANN TOP 10