AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంతటితో వివాదం ముగించండి.. సినీ పెద్దలకు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సూచన

హైదరాబాద్, అమ్మన్యూస్,

పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజా వివాద పరిష్కారానికి ముందడుగు వేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌ పై విమర్శలు చేస్తున్న క్రమంలో నటి సమంత, నాగచైతన్య, నాగార్జున విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సినీ పరిశ్రమ మొత్తం ఏకమైంది. మెగాస్టార్‌ చిరంజీవి, ఎన్టీఆర్‌, నాని, కోన వెంకట్‌, ఆర్జీవీ , వెంకటేష్‌, అల్లు అర్జున్‌ వంటి వారు ఈ విషయం గురించి తీవ్రంగా స్పందించారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ దీనికి ముగింపు పలికేందుకు సిద్ధమైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఈ విషయం గురించి రంగంలోకి దిగారు.

సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలకు ఓ కీలక విజ్ఞప్తి ని చేశారు. ఓ నటీమణిపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు విచారకరమని పేర్కొన్నారు. సదరు వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని విజ్ఞప్తి చేశారాయన. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్. భవిష్యత్‌లో సినీరంగానికి చెందిన వ్యక్తులను రాజకీయ వివాదాల్లోకి లాగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. మహిళా మంత్రి కొండా సురేఖ మీద బీఆర్ఎస్ నేత కేటీఆర్ సోషల్‌మీడియాలో ట్రోల్స్ అందరూ చూశారని వివరించారు. ఆ బాధతో మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా సమాజానికి మంచిది కాదన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని ఆయన అన్నారు.

ANN TOP 10