AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సడెన్ షాకిచ్చిన బంగారం.. ఒక్కరోజే రూ.500 జంప్.. తులం రేటు ఎంత అంటే?

బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి సడెన్ షాక్ తగిలింది. ఎందుకుంటే దేశీయ మార్కెట్లలో ఆభరణాల బంగారం 22 క్యారెట్ల గోల్డ్ రేటు వరుసగా తగ్గుతూ వచ్చి గురువారం ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు రికార్డ్ గరిష్ఠాల్లోనే కొనసాగుతున్నాయి. అలాగే దేశీయంగా ప్రస్తుతం పండగల సీజన్ కొనసాగుతోంది. దసరా దగ్గర పడుతున్న క్రమంలో బంగారానికి గిరాకీ క్రమంగా పెరుగుతోంది.

పసిడి ఆభరణాలకు గిరాకీ ఒక్కసారిగా పెరగడంతోనే ధరలు పెరిగినట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు దిగిరావడం గమనార్హం. ఇక గత నాలుగు రోజులుగా వెండి ధరలు ఒకే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్‌లో అక్టోబర్ 3వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

పెరిగిన 22 క్యారెట్ల గోల్డ్.. తగ్గిన 24 క్యారెట్ల పసిడి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. గత మూడు రోజుల్లో ఎంతైతే తగ్గింతే అంత ఇవాళ ఒక్కరోజే పెరిగింది. ఇవాళ 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.500 పెరిగి రూ. 71 వేల స్థాయికి ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల మేమిలి గోల్డ్ రేటు ఇవాళ తులంపై రూ.10 తగ్గడంతో ప్రస్తుతం రూ. 76 వేల 900 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర తులంపై రూ. 500 పెరిగి రూ. 71 వేల 150 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీలో రూ.540 పెరిగి రూ. 77 వేల 600 స్థాయికి చేరింది.

 

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10