AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత.. : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్-2024 కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటుందని తమ ప్రభుత్వం నమ్ముతున్నదన్నారు.

మరిన్ని ఆసుపత్రులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళాభ్యుదయం కోసం పలు కార్యక్రమాలు చేపట్టిందని సీఎం వివరించారు. కుటుంబంలో కీలక బాధ్యతలు నిర్వహించే మహిళల ఆరోగ్యం చాలా కీలకమని తమ ప్రభుత్వం భావిస్తోందని, అందుకే రాబోయే రోజుల్లో మహిళల కోసమే మరిన్ని ఆసుపత్రులు నిర్మించనున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరముందని, అప్పుడే సమాజంలో మంచి మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు.

కేన్సర్‌పై పోరాటం..
జీవనశైలి, కాలుష్యం, మారుతున్న పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా రోజు రోజుకీ కేన్సర్‌ బాధితుల సంఖ్య పెరిగిపోతోందని, ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని, దీనిపై మహిళలకు అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు. ముందస్తు పరీక్షలు నిర్వహించటం వల్ల సమస్యను వీలున్నంత మేర కట్టడి చేయవచ్చని వివరించారు.

ANN TOP 10